News January 29, 2025
రాజంపేట: ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం

అన్నమయ్య జిల్లా రాజంపేటలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఆకాశంలో ఏర్పడిన దృశ్యం కనువిందు చేసింది. నింగిలో అద్భుతం అంటూ పలువురు ఆసక్తిగా చూశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ – ఎఫ్15 రాకెట్ ప్రయోగం ఈరోజు ఉదయం జరిగింది. దాని తాలూకు గుర్తే ఏర్పడినట్లుగా పలువురు భావిస్తున్నారు. వాకింగ్‌కి వెళ్లిన పలువురు ఈ దృశ్యాన్ని తిలకించి చర్చించుకుంటున్నారు.
Similar News
News February 16, 2025
పెద్దపల్లి: అధికారులకు అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు

అటవీ శాఖ పరిధి భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కలెక్టరేట్ల అదనపు కలెక్టర్ వేణు అన్నారు. జిల్లాలో ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్‌కు సూచించారు. చెడు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చూడాలన్నారు.
News February 16, 2025
రేవంత్ ఢిల్లీకి వెళ్లేది అందుకే : కిషన్ రెడ్డి

TG: దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ డైరక్షన్ లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప.. కాంగ్రెస్ ఇచ్చిన కొత్త ఉద్యోగాలేమి లేవని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
News February 16, 2025
చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.