News September 21, 2024
రాజంపేట: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్న అభిషేక్ రెడ్డి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల మధ్య గ్లోబల్ లర్నింగ్ అనుభవాలను పెంచుకోవడమే లక్ష్యంగా రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ అభిషేక్ రెడ్డి ఈ నెల 18, 19 తేదీలలో ఫ్రాన్స్ పర్యటన చేశారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (EAIE) సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు ఆయనకు “ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్” అనే సర్టిఫికేట్ అందజేశారు.
Similar News
News October 6, 2024
దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు
దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 6, 2024
కడప నగరంలో కారు బోల్తా
బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.
News October 6, 2024
YVU: సెలవులున్నా.. పరీక్షలు యథాతథం
కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.