News April 10, 2024
రాజంపేట: ‘ఇప్పటికైనా గుర్తించి, సీటు ఇస్తే గెలుచుకొస్తా’

టీడీపీ అధిష్ఠానం ఇప్పటికైనా గుర్తించి, తనకు టీడీపీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట రాంనగర్‌లో బుధవారం తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల ప్రచారం ప్రారంభించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి ఈరోజు ప్రచారం ప్రారంభించగా, అదే సమయానికి బత్యాల మరో చోటు నుంచి ప్రచారం ప్రారంభించడం అందరినీ అయోమయ పర్చింది.
Similar News
News March 25, 2025
కడప: భార్యను చంపిన భర్త.. అనంతరం సూసైడ్

కడప జిల్లా వల్లూరు మండలంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. అంబవరం ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ భార్య సుజాతను విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
కడప జడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం: వాసు

త్వరలో జరగనున్న కడప జడ్పీ ఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికల్లో పోటీచేయలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. తమ పార్టీకి సంఖ్యాబలం లేదని అందుకే పోటీ చేయడం లేదన్నారు. అటు చంద్రబాబు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారన్నారు. కాగా కడపలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వైసీపీకి 42, టీడీపీ6గా సంఖ్యా బలం ఉంది.
News March 25, 2025
కడప: వాట్సాప్‌లో పదో తరగతి పేపర్ లీక్

కడప(D) వల్లూరు సెంటర్‌లో సోమవారం జరిగిన గణితం పరీక్షా పేపర్ లీక్ అయిందని డీఈవో షంషుద్ధీన్ స్పష్టం చేశారు. వేంపల్లె జిల్లా పరిషత్ పాఠశాల బీ కేంద్రంలో తనిఖీలు చేస్తుండగా మ్యాథ్స్ పేపర్ వాట్సాప్‌లో షేర్ అయింది. వల్లూరు స్కూల్లో వాటర్ బాయ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి పంపాడు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు.