News February 22, 2025

రాజంపేట ఎమ్మెల్యేకు నోటీసులు

image

రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపారు. మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అక్రమణ ఆరోపణలపై MLA, ఆయన కుటుంబ సభ్యులు నేడు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను, వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన విక్రయం కింద బదలాయించుకుని, అందులో ఎస్టేట్ నిర్మించుకున్నారని సుబ్బనరసయ్య ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 4, 2025

చండూరు: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

image

చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కావలి స్వాతి పోటీ చేస్తుండగా, కావలి శివాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

News December 4, 2025

విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

image

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.

News December 4, 2025

పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

image

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.