News February 22, 2025
రాజంపేట ఎమ్మెల్యేకు నోటీసులు

ఉమ్మడి కడప జిల్లా MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపారు. మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అక్రమణ ఆరోపణలపై రాజంపేట MLA, ఆయన కుటుంబ సభ్యులు నేడు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను, వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన విక్రయం కింద బదలాయించుకుని, అందులో ఎస్టేట్ నిర్మించుకున్నారని సుబ్బనరసయ్య ఫిర్యాదు చేశాడు.
Similar News
News February 23, 2025
తొండూరు: అక్రమ సంబంధం ఎంత పని చేసింది

మల్యాల ఘాట్ ముళ్ల పొదల్లో శనివారం మృతదేహం వెలుగుచూసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల.. చిలమకూరుకు చెందిన శివరామిరెడ్డి(56) ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మనస్పర్ధలతో ఇద్దరు వేరుగా ఉండగా, ఆమె అద్దెన్నతో సంబంధం పెట్టుకోగా శివరామిరెడ్డి వారించాడు. తమకు అడ్డుగా ఉన్నాడని భావించి శివరామిరెడ్డిని ఇంటికిపిలిచి కళ్లలో కారం కొట్టి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు.
News February 23, 2025
పులివెందుల: ‘మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు’

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అర్బన్ సీఐ నరసింహులు హెచ్చరించారు. శనివారం రాత్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఆయన వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లైసెన్సు లేని వాహనదారులకు, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారికి జరిమానాలు విధించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, తమ వాహన పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News February 22, 2025
కడప జిల్లాలో టమాటా రైతులకు శుభవార్త

కడప జిల్లాలో టమాట రైతులు పంట పండించి ఎలాంటి గుర్తింపుకార్డు లేకపోయినా రైతు బజార్లో సరుకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు కలెక్టర్ శ్రీధర్, జేసీ అతిథి సింగ్ తెలిపారు. కూరగాయల పంట సీజన్ కావడంతో అధిక దిగుబడి వచ్చిందని, గ్రామాల్లో ధర లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చన్నారు.