News January 13, 2025

రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామనాథ్ హెగ్డే

image

రాజంపేటలో ఏఎస్పీ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇంతవరకు రాజంపేటలో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఉండగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏఎస్పీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ మనోజ్ రామనాథ్ హెగ్డేను రాజంపేట సబ్ డివిజన్ నూతన ఏఎస్పీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News February 18, 2025

కడప: YVU వీసీగా ప్రకాశ్ బాబు

image

యోగి వేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రకాశ్ బాబును ఉన్నతాధికారులు నియమించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్‌ఛార్జ్ వైస్ చాన్సలర్లతో పరిపాలన కొనసాగిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీ నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ ప్రకాశ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ వీసీగా కొనసాగనున్నారు.

News February 18, 2025

కడప: జిల్లా వ్యాప్తంగా పోలీసుల పల్లెనిద్ర 

image

కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు ఉంటాయన్నారు

News February 18, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

image

నందలూరులో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకకు చెందిన టీడీపీ నేత కొమ్మినేని ప్రసాద్ (46) గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు, క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ ప్రతాప్ రాజు మంచి కార్యకర్తను కోల్పోయామన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

error: Content is protected !!