News October 28, 2024
రాజంపేట: చికెన్ ముక్క ఇరుక్కుని బాలుడి మృతి
రాజంపేటలో విషాద ఘటన జరిగింది. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు కూలీ పని నిమిత్తం రాజంపేటకు వలస వచ్చారు. పట్టణంలోని మన్నూరు సాతవీధిలో జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తల్లి ఇంటి పనులు చేసుకుంటుండగా.. సుశాంక్(2) పచ్చి చికెన్ ముక్క నోట్లో వేసుకున్నాడు. ఈక్రమంలో ఊపిరాడక మృతిచెందాడు.
Similar News
News November 7, 2024
రైల్వే కోడూరులో దారుణ హత్యకు గురైంది ఇతనే
ఉమ్మడి కడప రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి చెరువు కట్ట సమీపంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటనారాయణ(40) అని, కొద్ది రోజుల నుంచి రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడులోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నాడని సీఐ తెలిపారు. మృతుడు టైల్స్ వేసేపని చేస్తూ ఉండేవాడు. అయితే హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు.
News November 7, 2024
కడప ఇన్‌ఛార్జ్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును కడప జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా నియమించింది. వర్రా రవీంద్ర కేసు విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎస్పీని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
News November 6, 2024
కడప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం.!
జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో, ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు, కృషి చేస్తామని YSR జిల్లా నూతన కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనను, కలెక్టర్ ఛాంబర్లో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.