News March 22, 2024

రాజంపేట టీడీపీ సీనియర్ నేతపై కేసు నమోదు

image

మహిళ ఫిర్యాదు మేరకు TDP సీనియర్ నేత మోదుగుల పెంచలయ్యపై కేసు నమోదు చేసినట్లు రాజంపేట పట్టణ CI మద్దయ్య చారి తెలిపారు. వారి వివరాల మేరకు.. రాజంపేటలోని ఉస్మాన్ నగర్‌లో నివాసం ఉన్న ఒంటరి మహిళ ఇంటి వద్దకు బుధవారం రాత్రి పెంచలయ్య వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, బలవంతం పెట్టాడని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకొని మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News April 20, 2025

వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

image

వైవీయూ11,12,13,14వ కాన్వకేషన్స్ జూన్/ జులై నెలల్లో నిర్వహించనున్నామని వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. వీసీ ప్రొ. అల్లం శ్రీనివాస రావు స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ను http://convocation.yvuexams.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

News April 20, 2025

పెద్దముడియం: పిడుగు పడి యువకుడు మృతి

image

పెద్దముడియం మండలం చిన్నముడియంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుకు దండు బాను ఓబులేసు (24) మృతి చెందాడు. తన పొలంలో కొర్ర పంటకు నీరు కట్టేందుకు వెళ్లినప్పుడు పిడుగు పడటంతో ఓబులేసు మృతి చెందాడు. మృతుడు S.ఉప్పలపాడులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2025

ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

image

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి. 

error: Content is protected !!