News March 29, 2024

రాజంపేట: తమ నేతకు టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం

image

రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేటలో భవనంపై నుంచి దూకుతానని కొద్దిసేపు హల్చల్ చేశారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. టీడీపీ నేతలు కొందరు హుటాహుటిన భవనం పైకెక్కి మందా శీనును సముదాయించి కిందికి దించారు.

Similar News

News December 15, 2025

దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

News December 15, 2025

ఒంటిమిట్ట వద్ద ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

image

మండలంలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై ఆదివారం రాత్రి బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. గోవిందమాల వేసుకొని తిరుమల పాత్ర వెళుతున్న ఎర్రగుంట్లకు చెందిన జగదీశ్(20)ని ఒంటిమిట్ట చెరువు కట్ట పైకి రాగానే రాజంపేట, బాసింగరిపల్లికి చెందిన కత్తి వెంకటేశ్(27) బైకుపై వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో జగదీశ్ చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతిచెందాడు.

News December 15, 2025

కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.