News October 7, 2024

రాజంపేట: బైక్‌ స్కిడ్.. కుమారుడి మృతి

image

తండ్రీ కొడుకులు బైక్‌పై బయటకు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి కొడుకు మృతి చెందిన ఘటన రాజంపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజంపేటలోని పాత బస్టాండ్ సర్కిల్‌లో ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన తండ్రీ బాబూరామ్, పెద్ద కుమారుడు శ్యామ్ (5)బైక్‌పై వెళ్తున్నారు. బండి ఒక్కసారిగా స్కిడ్ అయి కొడుకు తల బలంగా రోడ్డును తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News November 10, 2024

ఆర్మీ ర్యాలీకి సర్వం సిద్ధం

image

కడప నగరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కడప నగరంలోని మునిసిపల్ మైదానంలో నిర్వహించే ర్యాలీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్మీ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రారంభిస్తారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు కడపకు చేరుకున్నారు.

News November 9, 2024

కడప నేతలకు కీలక పదవులు

image

రెండో జాబితాలో ఉమ్మడి కడప జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. అన్నమయ్య అర్బన్ రూరల్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నియమితులయ్యారు. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్‌గా కేకే చౌదరి ఎంపికయ్యారు. ఇక APSRTC రీజనల్ బోర్డు ఛైర్మన్‌గా పూల నాగరాజుకు అవకాశం దక్కింది.

News November 9, 2024

కడపలో హై టెన్షన్

image

కడపలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం జరిగిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో జరిగిన రచ్చ తెలిసిందే. గత ఎన్నికల్లో కడపలో ఓ పెద్దమనిషి తమకు సహకరించారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. దీంతో మేయర్ స్పందిస్తూ అందులో ఎటువంటి సత్యం లేదని, ఇవాళ దేవుని కడపలో ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడపలో హై టెన్షన్ నెలకొంది.