News September 17, 2024
రాజంపేట: సెప్టెంబర్ 20న జాబ్ మేళా నిర్వహణ
రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 20న జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లోని యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైదియా దేవి పాల్గొన్నారు.
Similar News
News October 10, 2024
రైల్వేకోడూరు: రేబీస్ వ్యాధితో మహిళ మృతి
ఉమ్మడి కడప జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రైల్వే కోడూరు మండలం ఎ.బుడగుంటపల్లి పంచాయతీ వికాస్ నగర్‌కు చెందిన పులికి మునిలక్ష్మి(35)ని ఆమె పెంచుకున్న పెంపుడు కుక్క కాటేసింది. ఈక్రమంలో ఆమెకు రేబీస్ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.
News October 10, 2024
కడప: నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. ముగ్గురిపై కేసు
కడప జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెడ్ కానిస్టుబుల్‌తో సహా ముగ్గురిపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కాయపల్లెలో 15సెంట్ల స్థలానికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ బాషాతో పాటు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి నెల్లూరుకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తిని బెదిరించడంతో అతడు ఫిర్యాదు చేశాడు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అవ్వడంతో కేసులు నమోదు చేస్తున్నారు.
News October 10, 2024
చెర్లోపల్లి అడవిలో చిరుత..?
చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందినపెద్దగొర్ల సుబ్బరాయుడు మేకపై చిరుత దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. తిరిగి రాత్రి అదే స్థలానికి చిరుత వచ్చిందని బాధిత రైతు చెప్పారు. అటవీ శాఖ రేంజ్ అధికారి ధీరజ్, రైల్వేకోడూరు సబ్ డీఎఫ్‌వో సుబ్బరాజు గురువారం ఘటన స్థలానికి వెళ్లారు. ఆ జంతు పాదముద్రలను పరిశీలించారు. చిరుత పాద ముద్రలుగా ఉన్నట్లు గమనించారు..