News July 30, 2024
రాజంపేట DSP చైతన్య బదిలీ

అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డిఎస్పీగా ఉన్న సమయంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాజంపేట DSPగా రావడం, ఎన్నికల సమయంలో తిరిగి తాడిపత్రి ఇన్ఛార్జ్ డీఎస్పీగా వెళ్లిన సమయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Similar News
News December 10, 2025
కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

కడప నగర నూతన మేయర్గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
News December 10, 2025
కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కడప SP

ఇటీవల నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్కు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అక్కడ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, మైదానం, కిచెన్ తదితరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News December 10, 2025
BREAKING: యర్రగుంట్లలో ఇద్దరు యువకుల మృతి

యర్రగుంట్లలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముద్దనూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే చనిపోయారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


