News October 4, 2024
రాజకీయ పార్టీలకు నెల్లూరు కలెక్టర్ సూచనలు
నెల్లూరు జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరి రివిజన్-2025లో భాగంగా ఈనెల 29న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలిపారు. వాటిపై నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పారు. డిసెంబర్ 24వ తేదీ లోపు అభ్యంతరాలను పరిష్కరించి.. 2025 సంవత్సరం జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు.
Similar News
News December 22, 2024
నెల్లూరు: బీచ్‌లో యువకుడు మృతి
ఆయన ఉద్యోగం కోసం కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్లాలి. సరదాగా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం కోసం బీచ్‌కు వెళ్లగా.. అదే అతడి చివరి రోజుగా మారింది. SI నాగబాబు వివరాల మేరకు.. దొరవారిసత్రం(M) తనయాలికి చెందిన సతీశ్, చెంచుకృష్ణ, మునిశేఖర్ రెడ్డి స్నేహితులు. సతీశ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో సరదాగా గడిపేందుకు తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లగా.. అలల తాకిడికి సతీశ్ కొట్టుకుపోయి చనిపోయాడు.
News December 22, 2024
నెల్లూరు: వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి పల్లకి సేవ
నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News December 21, 2024
నాయుడుపేట: నదిలో కొట్టుకొచ్చిన అస్థిపంజరం
నాయుడుపేటలో అస్థిపంజరం కలకలం రేపింది. స్వర్ణముఖి నదిలో కొట్టుకొచ్చిన మనిషి అస్తిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.