News March 18, 2025

రాజకీయ పార్టీలతో శ్రీకాకుళం డీఆర్‌వో సమీక్ష

image

శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బూత్ స్థాయి అధికారులు నియామకాలు, పోలింగ్ బూత్‌లకు సంబంధించి అంశాలపై చర్చించి పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, తదితర వాటిపై సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

Similar News

News April 24, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం బుడగట్లపాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ఏర్పాటు, గ్రామ సభ వేదిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ విధుల అమలుపై ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. 

News April 24, 2025

నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News April 24, 2025

ఉగ్రదాడిలో మన సిక్కోలు వాసి మృతి

image

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో సిక్కోలు వాసి మృతి చెందాడు. అతని కుటుంబం శ్రీకాకుళంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటోంది. SBIలో ఉద్యోగమొచ్చాక శ్రీకాకుళం నుంచి వెళ్లి విజయనగరంతో పాటు పలు ప్రాంతాల్లో చేశారు. బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోషన్ పొంది రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల కిందట విశాఖలో స్థిర పడ్డారు. ఈనెల 18న మరో మూడు రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీలతో కలిసి పర్యాటకానికి వెళ్లి హతులయ్యారు.

error: Content is protected !!