News March 16, 2025

రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమీక్ష

image

భద్రాద్రి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష జరిపారు. ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు జాబితా సంబంధిత ఫారాలు 6, 7, 8లపై రాజకీయ పార్టీ నాయకులకు అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా పార్టీ జిల్లా ఇంచార్జ్ ధ్రువీకరణ చేసి అందించాలని సూచించారు.

Similar News

News April 24, 2025

వెంకటేశ్‌తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

image

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్‌తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.

News April 24, 2025

గద్వాల: ‘అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

image

జిల్లాకు అవసరమైన వైద్యాధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ,ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

News April 24, 2025

డోర్నకల్: భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించనున్న కలెక్టర్

image

డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం 4గం.లకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ముఖ్య అతిదులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.

error: Content is protected !!