News November 5, 2024
రాజకీయ వేడి పుట్టిస్తున్న రాచమల్లు ప్రెస్మీట్లు

మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇటీవల ఆయన వరుస ప్రెస్మీట్లతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఆస్తులకు సంబంధించి వైఎస్ షర్మిల, విజయమ్మలపై కూడా ప్రశ్నలు సంధించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలపై మీ కామెంట్.
Similar News
News February 23, 2026
పులివెందులకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న పర్యటించే షెడ్యూల్ను వైసీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9:30 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి 10:30కి వేంపల్లి మండలం నంది పల్లె నందీశ్వర ఆలయానికి చేరుకుంటారు. తిరిగి 11:30కి అక్కడి నుంచి బయలుదేరి 12:30కి బాకరాపురం చేరుకొని మధ్యాహ్నం 2:30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2:30 నుంచి 6: 25 వరకు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 6:30కి ఇంటికి చేరుకొని అక్కడే బసచేస్తారు.
News February 23, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా

*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,750
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,490
*వెండి 10 గ్రాముల ధర రూ.2,700
News February 23, 2026
రాజంపేట: ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్

పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట డివిజన్ పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


