News November 3, 2024
రాజన్నను దర్శించుకున్న 60,256 భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ప్రారంభంలో 60,256 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే. వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
Similar News
News December 8, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,93,193 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,082 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,280, అన్నదానం రూ.20,831, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.
News December 7, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య. @ వేములవాడలో యారన్ డిపో ప్రారంభం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. @ వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ. @ 6 గ్యారెంటీలను అమలు చేసి తీరు తామన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
News December 7, 2024
కాళేశ్వరం: మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు
వచ్చే సంవత్సరం మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాల నిర్వహణకు అధికారులు అంచనాలు, నివేదికలు అందజేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సరస్వతీ పుష్కరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.