News June 6, 2024

రాజన్నను దర్శించుకున్న SBI చీఫ్ జనరల్ మేనేజర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్పొరేట్ సెంటర్) చీఫ్ జనరల్ మేనేజర్ మంజు శర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

Similar News

News December 12, 2025

కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ విధానంలో పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం ఆయన డీపీవో జగదీశ్వర్‌తో కలిసి బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

News December 12, 2025

ప్రచారానికి తెర.. కరీంనగర్ పల్లెలు సైలెంట్.!

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల సందడికి తెరపడింది. పాటలు, కరపత్రాలతో ఓటర్లను ఆకర్షించిన అభ్యర్థులు మౌనం వహించారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికారులు ఓటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

News December 12, 2025

కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

image

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్‌లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.