News December 2, 2024
రాజన్న ఆలయంలో మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు

వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మార్గశిర మాసం మొదటి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. చాలా మంది భక్తులు కొత్తగా పెళ్లయిన భక్తులు కోడలెక్కులు చెల్లించుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆలయం ముంగట గజ స్థంభ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.
Similar News
News February 9, 2025
కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
News February 8, 2025
చొప్పదండి: ప్రశాంతం నవోదయ ప్రవేశ పరీక్ష

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 9వ, 11వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. 1823 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 795 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు సహకరించిన కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో జనార్దన్ రావులకు ప్రిన్సిపల్ మంగతాయారు కృతజ్ఞతలు తెలిపారు.
News February 8, 2025
KNR: రేషన్ కార్డు దరఖాస్తులు.. అయోమయంలో ప్రజలు!

కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు మీ సేవలో శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రజా పాలన గ్రామసభలు దరఖాస్తులు ఇచ్చిన లబ్ధిదారులు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు ఇవ్వాలా? లేదా? అనే అయోమయంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.