News August 4, 2024
రాజన్న ఆలయంలో రేపటి నుంచి బ్రేక్ దర్శనాలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలను ఈనెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు సార్లు ఉ.10:15 నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయని, ఒక్కొ టికెట్‌పై రూ.300 ఛార్జీ, ఒక లడ్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 27, 2024
ఎంఈవోలు రోజుకో పాఠశాల సందర్శించాలి: కలెక్టర్ పమేలా
తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.
News November 27, 2024
సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను MLA విజయ రమణారావు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి బుధవారం పరిశీలించారు. రంగంపల్లి-పెద్దకల్వల శివారులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభ ఏర్పాట్లకు అనువుగా ఉంటుందని MLA తెలిపారు. సభా స్థలాన్ని శుభ్రం చేయాలని, గురువారం ఉదయం స్టేజ్ ఏర్పాటుకు HYD నుంచి ప్రత్యేక బృందం వస్తుందని చెప్పారు.
News November 27, 2024
ఉప్పల్ ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి ఈటల వినతి
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌ను ఈటల కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు.