News June 11, 2024
రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో మృతి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన బొట్ల వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.
Similar News
News December 8, 2025
KNR: ‘పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించారు. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News December 8, 2025
కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు. పోలింగ్ అధికారులను (పీవో) 1255 మందిని, ఇతర పోలింగ్ అధికారులను (ఓపివో) 1773 మందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.
News December 7, 2025
కరీంనగర్ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా జీపీవో అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉట్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయప్రసాద్, ఉపాధ్యక్షులుగా నూనె రమేష్, సాగర్, అనిల్, కోశాధికారి హరీష్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా నలువాల సాయికిషోర్, నీర్ల రేవంత్, జెట్టి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా పెంటి మమత, ఉపాధ్యక్షురాలుగా చందన, వనితలు ఎన్నికయ్యారు. తహశీల్దార్ బండి రాజేశ్వరి నూతన కమిటీని అభినందించారు.


