News October 14, 2024
రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం మంత్రి కొండ సురేఖ దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చారు. దీంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ అఖిల్ మహాజన్లు, వేములవాడ ఆర్డీవో పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Similar News
News October 17, 2025
రసమయి బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
News October 17, 2025
స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

కరీంనగర్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నూతన కార్యాలయాన్ని సీపీ గౌష్ ఆలం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇంతకుముందు పోలీస్ కమిషనర్ నివాసం వద్ద ఉన్న ఎస్బీ కార్యాలయాన్ని, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల స్మారక భవనంలోకి మార్చారు. నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సీపీ దీనిని ప్రారంభించారు. నూతన భవనం ద్వారా ఎస్బీ మరింత మెరుగైన సేవలు అందించాలని సీపీ ఆకాంక్షించారు.
News October 17, 2025
గన్నేరువరం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద సివిల్ సప్లై అధికారుల పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు. బొలెరోలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు మేరకు బొజ్జ రాజు పైన కేసు నమోదు చేశారు.