News June 11, 2024

రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో మృతి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన బొట్ల వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.

Similar News

News March 21, 2025

చొప్పదండి: భారీ వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంట

image

చొప్పదండి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నియోజకవర్గంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News March 21, 2025

శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కుమారుడు మృతి

image

శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్ వద్ద << 15837379>>లారీ, బైకు ఢీకొన్న<<>> సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మక్తకి చెందిన ఎస్కే అజీమ్, తన కుమారుడు రెహమాన్ శంకరపట్నం నుంచి బైకుపై ఇంటికి వెళ్తుండగా.. కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో బైక్‌పై వెళ్తున్న మెట్‌పల్లికి చెందిన మందాడి శ్రీనివాస్‌రెడ్డికి గాయాలయ్యాయి.

News March 21, 2025

HZB: కాకతీయ కెనాల్ కాలువలో మృతదేహం

image

హుజూరాబాద్ మండలం తుమ్మపల్లి కాకతీయ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!