News February 21, 2025
రాజన్న సిరిసిల్ల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News October 22, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల జాబితా.!

అమరావతి-అమరేశ్వరస్వామి దేవాలయం.
కోటప్పకొండ-శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.
పెదకాకాని-శ్రీ మల్లేశ్వరస్వామి.
బాపట్ల-సోమనాథేశ్వరస్వామి ఆలయం.
చీరాల-శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం.
మాచర్ల-కాళహస్తేశ్వరస్వామి.
గురజాల-వీరేశ్వరస్వామి.
సత్తెనపల్లి-పాండురంగేశ్వరస్వామి.
చేబ్రోలు-చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి.
గోవాడ-శ్రీ బాల కోటేశ్వరస్వామి.
చిలుమూరు-శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయం.
గుంటూరు-సాంబశివాలయం.
News October 22, 2025
కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమీక్ష

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.
News October 22, 2025
542 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/