News March 7, 2025
రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ బదిలీ

సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ కాగా ములుగు జిల్లా ఎస్పీ గిటే మహేశ్ బాబాసాహెబ్ సిరిసిల్ల జిల్లాకు ఎస్పీగా నియామకమయ్యారు. ఈ ఉత్తర్వు తక్షణమే అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News November 5, 2025
ఖమ్మంలోని గవర్నమెంట్ బ్యాంక్‌లో JOBS

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. ఖమ్మంలో 99 స్టాఫ్ అసిస్టెంట్‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT
News November 5, 2025
SRSP UPDATE: 4 గేట్లే ఓపెన్

ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో SRSP గేట్లను మూసివేస్తున్నారు. బుధవారం ఉదయం 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు.
News November 5, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, బాల్‌వాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsvizagnsb.nesnavy.in/


