News March 31, 2025
రాజన్న సిరిసిల్ల: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

SRCL జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 7,000 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 12, 2025
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News December 12, 2025
ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

దేశంలో ఫార్మా పీఎస్యూ (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 12, 2025
వికారాబాద్: ముగిసిన రెండో విడత ప్రచారాలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు ఈరోజు సాయంత్రం 5 గంటలతో నిలిపి వేయాలని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లో ఆయన ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు.


