News January 23, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

ఆకట్టుకుంటున్న పద్మనాభ శర్మ హరికథ @వార్డుసభను బాయ్ కాట్ చేసిన కౌన్సిలర్ విజయ్ @ నూకలమర్రి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం @సీఎం చిత్రపటానికి పాలాభిషేకం @బాలరాజుపల్లిలో రెండు గేదెల చోరీ@ఈస్ట్ ఇండియా కంపెనీ ముదించిన సీతారాముల నాణెం@వేములవాడలో క్రీడలు ప్రారంభించిన జడ్జి జ్యోతిర్మయి @సూరమ్మ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రికి ఎమ్మెల్యే ఆది వినతి @గంభీరావుపేట మండల ప్రజలకు సీఐ హెచ్చరిక.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.

News October 22, 2025

రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

image

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News October 22, 2025

మేడారంలో 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు

image

మేడారం మహా జాతర సమయంలో లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు వాహనాలను నిలిపేందుకు అధికార యంత్రాంగం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మేడారం జాతర సమీక్షలో కలెక్టర్ దివాకర వివరాలను వెల్లడించారు. 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 4.5లక్షల నుంచి 6లక్షల వాహనాలు ఏకకాలంలో నిలిపే అవకాశం ఉందన్నారు. 33 అటవీ మార్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.