News January 23, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

ఆకట్టుకుంటున్న పద్మనాభ శర్మ హరికథ @వార్డుసభను బాయ్ కాట్ చేసిన కౌన్సిలర్ విజయ్ @ నూకలమర్రి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం @సీఎం చిత్రపటానికి పాలాభిషేకం @బాలరాజుపల్లిలో రెండు గేదెల చోరీ@ఈస్ట్ ఇండియా కంపెనీ ముదించిన సీతారాముల నాణెం@వేములవాడలో క్రీడలు ప్రారంభించిన జడ్జి జ్యోతిర్మయి @సూరమ్మ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రికి ఎమ్మెల్యే ఆది వినతి @గంభీరావుపేట మండల ప్రజలకు సీఐ హెచ్చరిక.
Similar News
News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.
News February 10, 2025
హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.
News February 10, 2025
ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రికి చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థి సత్తా చాటారు. అండర్14 కటాస్ విభాగంలో జి. సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్, బిఎంఆర్ అకాడమీ నిర్వాహకులు సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశి అభినందించారు.