News February 23, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరవార్తల వివరాలు

image

@ఇల్లంతకుంట మండల కేంద్రంలో వివాహితను కాపాడిన పోలీసులు@సిరిసిల్లలో నలుగురిపై కేసు నమోదు:టౌన్ సీఐ కృష్ణ@మోసం చేసిన వ్యక్తి అరెస్టు…రిమాండ్ కు తరలింపు: సీఐ వీరప్రసాద్@అప్పుల బాధలు భరించలేక వివాహిత మృతి@అల్మాస్పూర్ లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత@మంటల్లో చిక్కుకొని మహిళ మృతి@వీర్నపల్లి లో ఎక్సైజ్ పోలీసుల దాడులు@సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

Similar News

News October 19, 2025

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా గుంజ శ్రీనివాసు

image

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేశ్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సిఫార్సుల మేరకు వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.

News October 19, 2025

పోలవరంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా పోలవరంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పెదవేగిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లి 101.2, బుట్టాయిగూడెం 85.4, ఏలూరు 84.8, జంగారెడ్డిగూడెం 80.4, నిడమర్రు 80.2, కొయ్యలగూడెం 79.8, ద్వారకాతిరుమల 73.0, భీమడోలు 49.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.

News October 19, 2025

గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

image

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.