News March 3, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా మార్నింగ్ ఉష్ణోగ్రతలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. కొనరావుపేట 39.0°c, వీర్నపల్లి 39 0°c, సిరిసిల్ల 38.6°c, రుద్రంగి 38.5 °c, గంభీరావుపేట 37.9°c, ఇల్లంతకుంట 37.7°c, చందుర్తి 37.3°c, బోయిన్పల్లి 37.2 •c, ముస్తాబాద్ 36.6 °c, ఎల్లారెడ్డిపేట 36.2°c, వేములవాడ 36.1°cగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News December 7, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం

నూజివీడులో ట్రిపుల్ ఐటీలో చదువుతున్న బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టడీ క్లాస్ నుంచి హాస్టల్ కు వెళ్లవలసిన బాలిక కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. బాలిక అదృశ్యంపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 7, 2025
15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: లోకేశ్

AP: గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని.. రాష్ట్రంలోనూ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ‘కలిసికట్టుగా పనిచేస్తామని పవనన్న పదేపదే చెబుతున్నారు. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని డలాస్ తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేశ్ తెలిపారు.
News December 7, 2025
ప్రకాశం ప్రజలకు కలెక్టర్ కీలక సూచన.!

ఒంగోలులోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కానివారు వాటి స్లిప్పులను తీసుకురావాలన్నారు.


