News March 3, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా మార్నింగ్ ఉష్ణోగ్రతలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. కొనరావుపేట 39.0°c, వీర్నపల్లి 39 0°c, సిరిసిల్ల 38.6°c, రుద్రంగి 38.5 °c, గంభీరావుపేట 37.9°c, ఇల్లంతకుంట 37.7°c, చందుర్తి 37.3°c, బోయిన్పల్లి 37.2 •c, ముస్తాబాద్ 36.6 °c, ఎల్లారెడ్డిపేట 36.2°c, వేములవాడ 36.1°cగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News March 22, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం

ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు మధ్యాహ్నం తన కల్లంలో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగానే.. అతడు పరారయ్యాడు. పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2025
ప్రొద్దుటూరు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే జిల్లా బహిష్కరణ

నేటి నుంచి జరగనున్న IPL క్రికెట్ సందర్భంగా బెట్టింగ్ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఎస్పీ భావన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉందని, గతంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. పదే పదే బెట్టింగ్ నిర్వహిస్తే జిల్లా బహిష్కరణ ఉంటుందన్నారు.
News March 22, 2025
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నిందితుల అరెస్ట్

హిందూపురం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులు మంజుల, కానిస్టేబుల్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. టూటౌన్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సహకారంతో మోడల్ కాలనీలో మంజుల వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈశ్వర్ అనే వ్యక్తి పారిపోయాడు. మంజుల, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.