News March 16, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను ఆదివారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి రాజేశ్వర్ రావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, తిరుపతి యాదవ్, తిరుపతి ఉన్నారు.
Similar News
News January 6, 2026
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.
News January 6, 2026
పోలవరంపై సీఎం డెడ్లైన్.. నిపుణుల ఏమంటున్నారంటే..!

2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాలకు సమయం పడుతుందని, గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాల్సి ఉన్నందున అధికారులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కాగా 7వ తేదీన చంద్రబాబు పోలవరం రానున్న సంగతి తెలిసిందే.
News January 6, 2026
వారేవా.. HCUకు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొ.అనిల్ కుమార్ చౌదరి, స్కాలర్ చందన్ ఘోరుయీ పేలుడు పదార్థాలను గుర్తించి ప్రమాదాల నివారించే పరికరాన్ని రూపొందించారు. 0.3 టెరాహెట్జ్ రాడార్ వ్యవస్థను తయారుచేశారు. ఇది పేలుడు పదార్థాలను, లోహాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది. వీరి పరిశోధన వివరాలు అంతర్జాతీయ IEEE సెన్సార్ జర్నల్లో ప్రచురించారు.


