News January 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వెదర్ అప్‌డేట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10 మండలాల్లో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంభీరావుపేట 12.9, తంగళ్ళపల్లి 13.8, రుద్రంగి 13.8, కోనరావుపేట 14.2, వీర్నపల్లి 14.2, బోయినపల్లి 14.6, వేములవాడ రూరల్ 14.6, ముస్తాబాద్ 14.9, చందుర్తి 15.0, గంభీరావుపేట 15.0 లుగా చలి ఉన్నట్లు తెలిపారు. ఈ చలికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.
Similar News
News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
NGKL: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 34 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
News February 18, 2025
యాదాద్రి: అమ్మకు భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో “అమ్మకు భరోసా” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఒకేరోజు 300 మంది గర్భిణుల ఇండ్లకు ఏకకాలంలో 300 మంది అధికారుల బృందాలు వెళ్లాయి. ఇందులో భాగంగా గుండాల మండలంలోని అనంతారానికి చెందిన అపర్ణ అనే గర్భిణి ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, న్యూట్రిషన్ కిట్ అందించారు.