News March 19, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా నమోదయ్యాయి. ఇల్లంతకుంట 39.7 °c, వీర్నపల్లి 39.6 °c, చందుర్తి 39.4°c, గంభీరావుపేట 39.3 °c, ఎల్లారెడ్డిపేట 39.5 °c, తంగళ్ళపల్లి 39.5 °c, కోనరావుపేట 39.0 °cగా ఉంది. ఈ మండలాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా మండలాల్లో చలి పెడుతూనే ఎండ కొడుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News September 17, 2025

వరంగల్: రజాకార్ల ఆకృత్యాలు.. నెత్తుటి గాథలు!

image

రజాకార్ల పాలనలో ఓరుగల్లు పోరాటాల గడ్డగా నిలిచింది. విమోచన ఉద్యమ చరిత్రలో బత్తిని మొగిలయ్య గౌడ్ వారిపై దండెత్తాడు. బైరాన్‌పల్లి గ్రామం, పరకాల, కూటిగల్, తొర్రూరు కడవెండి, అమ్మాపూర్, నాంచారి మడూర్, జాఫర్‌ఘడ్, మధిర, ఖిలా వరంగల్ కోట వంటి గ్రామాలపై రజాకార్లు విరుచుకుపడి వందలాదిమంది ఉద్యమకారులను కాల్చి చంపారు. ఇప్పటికీ పరకాల, బైరాన్‌పల్లి నెత్తుటి గాథలు అక్కడ ఇంకా సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

News September 17, 2025

నిర్మల్: అతిథి అధ్యాపకుల వేతన వ్యథలు

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 37 మంది అతిథి అధ్యాపకులకు ఇప్పటివరకు 3 నెలలుగా వేతనాలు రావడం లేదని డిగ్రీ అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.సురేందర్ పేర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ సరైన సమయానికి వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దసరా పండుగ లోపు బకాయిలు ఖాతాలో జమ చేయాలని కోరారు.

News September 17, 2025

హార్టీకల్చర్ కోర్సులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం: శ్రీనివాసులు

image

తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో బీఎస్సీ హార్టీకల్చర్, ఫారెస్టరీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఈ నెల 18వ తేదీ లోపు కాలేజీ ఎంపికకు అవకాశం కల్పించారన్నారు.