News March 23, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

రాజన్న SRCL జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. చందుర్తి(M) ఎనగల్ గ్రామంలో పసుల లచ్చయ్య(60) అనే ఉపాధిహామీ <<15847894>>కూలీ<<>> పనిచేసాక భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మామిండ్ల మహేశ్(24) ఈ నెల17న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్సపొందుతూ నిన్న మృతిచెందాడు. బోయినపల్లి మండలం మానవాడలో దాసరి నర్సయ్య(58) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

Similar News

News September 16, 2025

అన్నమయ్య: ‘బొప్పాయి తక్కువకు అడిగితే కాల్ చేయండి’

image

అన్నమయ్య జిల్లాలో సెప్టెంబర్ 16వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8లుగా నిర్ణయించబడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7లుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ నంబర్ (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

News September 16, 2025

నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి: ఎస్పీ రోహిత్ రాజు

image

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నేరస్థులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

News September 16, 2025

సంగారెడ్డి: ఈనెల 18న ఉమ్మడి జిల్లా ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా బాక్సింగ్ ఎంపికలు ఈ నెల 18న సంగారెడ్డిలోని సెయింట్ ఆంటోనీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. బాల బాలికల అండర్- 14, 17 ఎంపికలు జరుగుతాయని చెప్పారు.