News April 11, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణొగ్రత వివరాలు..

గడిచిన 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇల్లంతకుంట 41.2°c, వీర్నపల్లి 41.1°c, రుద్రంగి 40.3°c, బోయిన్పల్లి 40.3°c, వేములవాడ రూరల్ 39.9°c, చందుర్తి 39.9°c, గంభీరావుపేట 39.4°c, తంగళ్ళపల్లి 39. 4°c, ముస్తాబాద్ 39.3°c, సిరిసిల్ల 38.7°c, ఎల్లారెడ్డిపేట 38.0°cలుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News April 22, 2025
తుని: 28న మున్సిపల్ ఛైర్‌పర్సన్ , వైస్ చైర్మన్ ఎన్నిక

తుని మున్సిపాల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ స్థానాలకు ఈనెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కోన్నారు. ప్రక్రియలో భాగంగా, 24న కలెక్టర్ ఎన్నికల అధికారి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. దీనితో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
News April 22, 2025
వరంగల్: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News April 22, 2025
వరంగల్: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్ష ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షల టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.