News April 15, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రత అప్డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 39.6°c, ఇల్లంతకుంట 39.5 °c, ఎల్లారెడ్డిపేట 39. 5°c, వేములవాడ రూరల్ 39. 4°c, ముస్తాబాద్ 39.2°c, గంభీరావుపేట 39.2°c, కొనరావుపేట 39.0°c, బోయిన్పల్లి 38.7 °c,చందుర్తి 38.6°c, ముస్తాబాద్ 38.3 °c,తంగళ్ళపల్లి 38.3 °c,సిరిసిల్ల 38.2°c లుగా నమోదయ్యాయి.

Similar News

News December 1, 2025

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ షురూ

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్(GD)ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వెబ్‌సైట్: <>https://ssc.gov.in/<<>>

News December 1, 2025

శ్రీపతిపల్లి: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు

image

‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. చిల్పూర్(M) శ్రీపతిపల్లికి చెందిన రంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, ఆయన సోదరుడు రంగు హరీష్ BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి పోటీలో నిలవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

News December 1, 2025

సీఎం పర్యటనలో లోపాలు చోటు చేసుకోవద్దు: ADB కలెక్టర్

image

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాకు చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలన్నారు.