News January 28, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పది మండలాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట 12.8, రుద్రంగి 13.8, తంగళ్ళపల్లి 13.9, వీర్నపల్లి 14.1, కోనరావుపేట 14.2, వేములవాడ రూరల్ 14.3, బోయిన్‌పల్లి 14.4, చందుర్తి 14.6, కొనరావుపేట 14.7, ముస్తాబాద్ 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాని వాతావరణశాఖ తెలిపింది.

Similar News

News December 22, 2025

సిరిసిల్ల: కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

image

సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 260 జీపీలు, 2,268 వార్డుల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. నిధుల సమస్యతో ప్రమాణ స్వీకార ఖర్చు విషయంలో కార్యదర్శులు తర్జనభర్జన పడుతున్నారు.

News December 22, 2025

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా జబిబుల్లా

image

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మైనార్టీ నేత జబిబుల్లాను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రొద్దుటూరుకు చెందిన జబిబుల్లా టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైఎస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు, మైనార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తన నియామకానికి మద్దతునిచ్చిన, సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి జబిబుల్లా కృతజ్ఞతలు తెలిపారు.

News December 22, 2025

27న మండల పూజ.. ఆ రోజుల్లో శబరిమల ఆలయం మూసివేత

image

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10.10AM నుంచి 11.30AM వరకు కొనసాగనుంది. ‘26న 6.30PMకు పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరుకుంటాయి. స్వామిని అలంకరించి దీపారాధన నిర్వహిస్తాం. 27న రాత్రి 11 గంటలకు హరివరాసనం అనంతరం ఆలయం మూసివేస్తాం. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న 5PMకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.