News January 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కూరగాయల ధరలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మంగళవారం రోజు కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా కేజీ 10, మిర్చి కేజీ 35, క్యాప్సికం కేజీ 40, పచ్చ కూర కేజీ 20, పాలకూర కేజీ 20, బీట్రూట్ కేజీ 30, సొరకాయ ఒకటి 10, కొత్తిమీరు కేజీ 40, ఆలుగడ్డ కేజీ 20, ఉల్లిగడ్డ కేజీ 25, కాకరకాయ కేజీ 60, బెండకాయ కేజీ 40, చిక్కుడుకాయ కేజీ 40, మెంతికూర కేజీ 50,చుక్కకూర కేజీ 40, అల్ చింతకాయ కేజీ 30 రూపాయలుగా ఉన్నట్లు రైతు బజార్ రైతులు తెలిపారు.
Similar News
News November 24, 2025
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా?

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇలా కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడంతో పాటు, వెరికోస్వెయిన్స్ సమస్యలు వస్తాయి. గర్భిణులు ఇలా కూర్చుంటే కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి, తిమ్మిర్లు, చీలమండ వాపు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఎక్కువసేపు ఇలా కూర్చోవడం వల్ల పోశ్చర్ కూడా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు.
News November 24, 2025
అన్ని రికార్డుల్లోనూ జిల్లా పేరు మార్పు: జేసీ

అన్ని ప్రభుత్వ పత్రాల్లో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ పేరును చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖలో ఈ మార్పు జరిగిందని, మిగిలిన శాఖల్లోనూ పూర్తిస్థాయిలో పేరు మారేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం పడుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.
News November 24, 2025
ధర్మేంద్ర చివరి సినిమా ఇదే

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం చేశారు. 1960-80 మధ్య స్టార్డమ్ సంపాదించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. షోలే, పూల్ ఔర్ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించారు. చివరిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాలో సినిమాలో కనిపించారు. ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.


