News January 28, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యాంశాలు

image

మల్కాపూర్ గుట్టలో పెద్దపులి.. భయాందోళనలో గ్రామస్థులు
@రూ.15కోట్ల 65లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
@పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ
@రేపు మామిడిపల్లి సీతారాముల ఆలయంలో మాఘ అమావాస్య జాతర
@ప్రభుత్వ విప్ ఆది చొరవతో స్వదేశానికి అంజి
@బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంజనీ కుమార్
@కరాటే శిక్షకులకు దరఖాస్తుల ఆహ్వానం
@భవిష్యత్ మళ్లీ కచ్చితంగా గులాబీ జెండాదే: కేటీఆర్

Similar News

News November 19, 2025

నేడు పుట్టపర్తికి మోదీ రాక

image

AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

News November 19, 2025

భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

image

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్పాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.

News November 19, 2025

వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

image

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.