News January 29, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత ఉన్న మండలాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు మండలాలకు చలి తీవ్రత ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. గంభీరావుపేట 13.5, బోయిన్పల్లి 14. 2, తంగళ్ళపల్లి 14.5, రుద్రంగి 14.7, వేములవాడ రూరల్ 14.8, వీర్నపల్లి 14.9, కోనరావుపేట 14.9గా టెంపరేచర్ నమోదయ్యింది. ఈ 7 మండలాలకు చలి తీవ్రత ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.

Similar News

News October 30, 2025

కోస్గి: కల్లు సీసాలో ఎలుక కలకలం

image

క‌ల్లు తాగేందుకు వెళ్లిన ఓ మహిళకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. తాను తీసుకున్న క‌ల్లు సీసాలో చనిపోయిన క‌నిపించ‌డంతో.. షాక్‌కు గురై ఆందోళ‌న చెందింది. కోస్గి మండలం నాగుసాన్‌పల్లిలో ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బాలమణి బుధవారం తాగి ఎందుకు దుకాణంలో కల్లు కొనుగోలు చేసి, అక్కడే తగేందుకు ప్రయత్నించగా సీసాల నుంచి కల్లు బయటకు రాలేదు. గమనించి చూడగా ఎలుక కనబడింది. అప్రమత్తమైన తోటి వారు కల్లు పారబోశారు.

News October 30, 2025

ఈ-కేవైసీ చేయకపోతే నో సబ్సిడీ!

image

వంట గ్యాస్ వినియోగదారులు ఏటా MAR 31లోపు ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత e-KYC చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే PM ఉజ్వల యోజన కింద సబ్సిడీ రాదని తెలిపింది. దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. కాగా కేంద్రం సబ్సిడీ కింద సిలిండరుకు రూ.40 జమ చేస్తోంది.

News October 30, 2025

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్‌గౌడ్

image

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.