News March 13, 2025

రాజన్న సిరిసిల్ల: ప్రజలు హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం, పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం, బలవంతంగా రంగులు చల్లొద్దని అన్నారు. అనవసర గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News December 10, 2025

అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

image

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.

News December 10, 2025

పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

image

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.

News December 10, 2025

TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్‌పే చేయడంతోనే!

image

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్‌తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్‌గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.