News March 13, 2025
రాజన్న సిరిసిల్ల: ప్రజలు హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం, పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం, బలవంతంగా రంగులు చల్లొద్దని అన్నారు. అనవసర గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News March 24, 2025
కర్నూలులో టీడీపీ నేత హత్య.. నిందితుడి భార్య అరెస్ట్

కర్నూలులో పాత కక్షలతోనే టీడీపీ నేత సంజన్న ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా నిందితుడు వడ్డె రామాంజనేయులు భార్య సావిత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వడ్డె రామాంజనేయులుతో పాటు అతడి ముగ్గురు కుమారులు, మరొకరిని పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.