News March 11, 2025

రాజన్న సిరిసిల్ల: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. సిరిసిల్లలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News December 9, 2025

సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

image

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

News December 9, 2025

మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

image

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.

News December 9, 2025

ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

image

TG: దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచస్థాయి నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందిస్తాం. ఇక్కడి సంస్థల ద్వారా 13L మందికి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల జనాభాకు వీలుగా గృహ నిర్మాణం జరుగుతుంది. డేటా సెంటర్లకు 400 ఎకరాలిస్తాం’ అని వివరించారు. అద్భుత ఆర్కిటెక్చర్ అర్బన్ ఫారెస్టులు ఉంటాయన్నారు.