News February 6, 2025
రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..
స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. పార్థసారథికి 23వ ర్యాంకు
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి 23వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
బాపట్ల జిల్లా మంత్రులకు CM ర్యాంకులు
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్, అనగాని సత్యప్రసాద్ 21 ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని CM సూచించారు.
News February 6, 2025
మంత్రి స్వామికి 5వ ర్యాంక్
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 5వ ర్యాంక్, బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాని CM సూచించారు.