News April 5, 2025
రాజన్న సిరిసిల్ల వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల14 వరకు గడువుంది. జూన్2 నుంచి 9వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్&ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
Similar News
News December 1, 2025
నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.
News December 1, 2025
టీటీడీలో అన్యమతస్తులపై నివేదిక తయారీ

టీటీడీలో అన్యమతస్తుల అంశం మరోసారి తెర పైకి వచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఇంకా ఎవరైనా ఆన్యమతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.
News December 1, 2025
సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ పారితోష్ పంకజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది సమస్యలు విన్నవించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు.


