News April 5, 2025

రాజన్న సిరిసిల్ల వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల14 వరకు గడువుంది. జూన్2 నుంచి 9వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్&ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 20, 2025

సఖినేటిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం రోడ్డులో రాంబాగ్ దాటిన తరువాత IPC చర్చి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న నిమ్మకాయల వ్యాపారి బొనం బాపిరాజు (35) కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

image

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.

News April 20, 2025

ఆత్మకూరు: ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్ 

image

ఆత్మకూరులో కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గర్భంలోనే చనిపోయిన శిశువు తల, మొండెం వేరుచేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సర్జరీ చేసే చేసే క్రమంలో అనస్తీషియాను అర్హత లేని వ్యక్తులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

error: Content is protected !!