News April 21, 2025
రాజన్న సిరిసిల్ల: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281.
Similar News
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. HYDలో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిల్పూర్ RI

భూ సర్వే కోసం రూ.26 వేలు లంచం తీసుకుంటూ RI ఏసీబీకి పట్టుబడ్డారు. చిల్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో RIగా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఓ వ్యక్తి వద్ద భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. సోమవారం బాధితుడు రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
News April 21, 2025
SVU పరీక్షల వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.