News November 27, 2024

రాజన్న స్వామివారి హుండీ ఆదాయం వివరాలు ఇవే

image

వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.

Similar News

News December 11, 2024

ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు. 

News December 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ. @ ఇబ్రహీంపట్నం మండలంలో హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. @ కథలాపూర్ మండలంలో జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాము. @ ఈ నెల 15లోగా సీఎంఆర్ అందించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ చందుర్తి మండలంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్. @ వేములవాడ రాజన్నా ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల మెట్పల్లిలో నిరసన.

News December 10, 2024

KNR: సోషల్ మీడియా క్రేజ్‌లో యువత చిత్తు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా క్రేజ్‌లో పడి యువత తమ బంగారు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కుటుంబంతో గడపడం కంటే యువత స్మార్ట్ ఫోన్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని తెలిసిన కొందరు యువతులు లైకులు, కామెంట్ల కోసం ఇటీవల ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.