News February 16, 2025

రాజబాబు లేనిలోటు తీరనిది: జగన్

image

ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లికి చెందిన YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు కన్నుమూశారు. ఆయన మృతిపై మాజీ సీఎం జగన్‌ స్పందించారు. ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. రాజబాబు మరణం మా పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Similar News

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

News December 4, 2025

HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

image

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.

News December 4, 2025

CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <>దరఖాస్తుకు<<>> చివరి తేదీ: డిసెంబర్ 22.